బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ స్కెచ్.. భాగస్వామ్య పార్టీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు సిద్ధం!

16-06-2018 Sat 13:27 | National
  • ఎక్కువ పార్టీలతో జతకట్టాలన్న ఆలోచన
  • భాగస్వామ్య పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించేందుకు సన్నద్ధం 
  • 2019 ఎన్నికలకు రోడ్డు మ్యాప్ ను రూపొందించే బాధ్యత ఏకే ఆంటోనీ కమిటీకి
నరేంద్రమోదీ సారధ్యంలోని బీజేపీని 2019లో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు కాంగ్రెస్ ఓ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ వార్తా సంస్థ ఈ మేరకు ఓ వార్తా కథనాన్ని రూపొందించింది. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఓ పెద్ద కూటమిగా ఏర్పడి 2019 ఎన్నికలను ఎదుర్కోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇందుకోసం భాగస్వామ్య పార్టీలకు ఎక్కువ సీట్లను కేటాయించాల్సి వస్తే తాను 250 సీట్లతో అయినా సరిపెట్టుకోవాలని భావిస్తోంది. ఇదే జరిగితే స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ స్థానాల్లో పోటీ చేసినట్టు అవుతుంది.

2019 ఎన్నికలకు సంబంధించి రోడ్డు మ్యాప్ ను రూపొందించే బాధ్యతను ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కమిటీకి రాహుల్ అప్పగించారు. ప్రజల అంచనాలు, పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ కమిటీ కాంగ్రెస్ పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల అభిప్రాయాలు కోరింది.  పూర్తి సంప్రదింపుల తర్వాతే ఆంటోనీ కమిటీ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయనుంది. 250 సీట్ల కంటే తక్కువకే పరిమితం కావాలని పార్టీలో ఓ వర్గం భావిస్తుండగా, గెలిచే అవకాశాలున్న వారినే బరిలోకి దింపాలని మరో వర్గం భావిస్తోంది.
congress partybjp2019 elections

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more